నరేంద్ర మోదీవి 'పకోడీ' పాలిటిక్స్: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్య

  • బీజేపీ ప్రోద్బలంతోనే నిరసనలు
  • కర్ణిసేనకు సరెండర్ అయిన మోదీ
  • 56 అంగుళాల ఛాతీ ముస్లింల అణచివేతకే
  • ట్విట్టర్ లో ఆరోపించిన అసదుద్దీన్ ఒవైసీ
'పద్మావత్' చిత్రంపై జరుగుతున్న నిరసనలన్నీ బీజేపీ ప్రోద్బలంతోనే జరుగుతున్నాయని ఏఐ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆయన 'పకోడీ' పాలిటిక్స్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనలు తెలుపుతున్న వారందరికీ, ప్రధాని, ఆయన పార్టీ సరెండర్ అయ్యారని తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించారు.

 మోదీకి ఉన్న 56 అంగుళాల ఛాతీ ముస్లింలను అణచి వేసేందుకే ఉపకరిస్తుందని అన్నారు. కాగా, 'పద్మావత్' చిత్రంపై నిరసనలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు ఏమీ లేవని సినీ విశ్లేషకులు చెబుతున్నా, ఈ ఉదయం కూడా పలు ప్రాంతాల్లో విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి.
Go Back to Shorts
Padmaavat
Asaduddin Owaisi
Narendra Modi
BJP

More Telugu News